

ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటేల్ గూడ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా అభ్యాసంతోపాటు విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని, సమగ్ర వికాసమే వారి భవిష్యత్తును వెలుగొందించగలదని సూచించారు.