
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ పాలకవర్గాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమమని, పదవులు అశాశ్వతమని అన్నారు. పదవిలో ఉన్నా.. లేకపోయినా.. ప్రజల మధ్యలో ఉంటూ.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే.. అవకాశాలు వాళ్లే కల్పిస్తారని తెలిపారు.
ప్రజల చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడటం ఒక అదృష్టమని.. వారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే పరిపూర్ణత లభిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.