
ఇంద్రధనుస్సు ప్రతినిధి: ప్రభుత్వం బిసి కుల గణన చేసిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి సచివాలయంలో బిసి సంఘాలు సన్మానం చేశాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, చిరంజీవులు తదితరులు ఉన్నారు. బీసీ కుల గణన చట్టబద్దత కోసం కృషి చేస్తున్న టిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి పొన్నం ప్రభాకర్ లకు బీసీ సంఘాల నేతలు, ఫ్రొఫెసర్లు ధన్యవాదాలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల చట్ట బద్దత కోసం శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టడమే కాకుండా కేంద్ర పెద్దలతో అన్ని పార్టీలను తీసుకుపోయి చర్చిస్తామని – టిపీసీసీ చీఫ్ తెలిపారు.