
ఇంద్రధనుస్సు ప్రతినిధి: దశాబ్దాలుగా సుదీర్ఘమైన డిమాండ్లను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, సంబరాలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారితో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ మాదిగ జాతి సోదరుల చిరకాల డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణ ఒకవైపు, బీసీలకు రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు బీసీ కులగణన మరోవైపు నిర్వహించి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి రుజువైందన్నారు. బీసీలకు విద్యాపరంగా రాజకీయపరంగా అవకాశాలను పెంపొందించేందుకు నిర్వహించిన బీసీ కులగణన సర్వేలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీసీలు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేకనే బిఆర్ఎస్ పార్టీ బీసీ కుల గణన సర్వేపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబం సర్వేలో వివరాలు ఎందుకు నమోదు చేయలేదో కారణం తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ద్వారా సమగ్ర అధ్యయనం చేయించి అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టిందని వివరించారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకు తగినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటూ బలహీనవర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీసీల దశాబ్దాల పోరాటంతో బీసీ కులగణన, మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ బిల్లును కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించడం హర్షనీయమన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్యామ్ సుందర్ రెడ్డి ,మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, అధ్యక్షుడు నర్సింహులు, మాజీ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్,చంద్రపాల్ రెడ్డి,రాం రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి అందే మోహన్, హరినాథ్ రెడ్డి, కృష్ణా రెడ్డి,శేఖర్, శ్రీకాంత్ గౌడ్,యాదయ్య,రాములు, చెన్నయ్య,జగన్, తదితరులు పాల్గొన్నారు.