
ఇంద్రధనుస్సు ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా రథసారథి శ్రీమతి గోదావరి అంజి రెడ్డి గారి ఆధ్వర్యంలో పటాన్చెరు అసెంబ్లీ మరియు సంగారెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్ మహాశయులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరియు ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ బిజెపి వైపు ఉన్నారని తెలుపుతూ మార్చిలో జరుగనున్నటువంటి ఎన్నికల్లో బిజెపికి అమూల్యమైన ఓటు వేసి అంజి రెడ్డి గారిని మరియు మల్క కొమరయ్య గారిని శాసనమండలిలోకి పంపించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి డా అంజి రెడ్డి గారు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య గారు, మరియు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ గారు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు మరియు ఎన్నికల జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ శిల్పారెడ్డి గారు పాల్గొన్నారు.