
ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఉమ్మడి నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంగళ వారం రోజు జిల్లా పార్టీ ఆఫీసులో బీజేవైఎం నాయకులతోని, కార్యకర్తలతోని వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది… ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెవైఎమ్ అధ్యక్షులు “చేవెళ్ల మహేందర్” గారు రావడం జరిగింది…. మహేందర్ గారు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేవైఎం సత్తా చాటాల్సిన అవసరం వచ్చిందని, ఎందుకంటే వాళ్ళందరూ మనలో ఒకరే, దాదాపుగా యువత, ఉపాధ్యాయులు బిఆర్ఎస్ పైన మరియు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకతో ఉన్నారని, వాళ్లని మనం కలిసి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజి రెడ్డి గారికి మరియు కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా కోరాలి. తప్పకుండా వారి ఓట్లు మనకే వేస్తారు కాబట్టి బీజేవైఎం కార్యకర్తలు పని విభజన చేసుకొని ముందుకు సాగాలని సూచించారు… అలాగే బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు బీజేవైఎం కార్యకర్తలను ఉద్దేశించి దిశా నిర్దేశం చేయడం జరిగింది.