
ఇంద్రధనుస్సు ప్రతినిధి: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీనుపూర్ మున్సిపల్ పరిధిలో ప్రజల సౌకర్యార్థం శాశ్వత ప్రతిపాదికన ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున సాయంత్రం అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య రోడ్డులో ఒక కోటి 43 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, కోటి రూపాయల అంచనా వ్యయంతో మున్సిపల్ కార్యాలయం, 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణ పనులకు స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన పాలకవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో అమీనుపూర్ మున్సిపల్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.