






ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ 13 వార్డు పరిధిలోని సృజనలక్ష్మీ నగర్ కాలనీలో పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, 15 వార్డు కౌన్సిలర్ శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ దంపతులు 26-1-2025 తేదీన రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి, భరత జాతి ఔన్నత్యాన్ని కొనియాడారు. తదనంతరం కౌన్సిలర్ శ్రీమతి జి. లావణ్య శశిధర్ రెడ్డి గారు తమ సొంత నిధులు 15 లక్షల రూపాయలతో సృజన లక్ష్మీ నగర్ కాలనీలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఉదయం 11-30 గంటలకు శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులు ప్రారంభించారు. కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించటానికి విచ్చేసిన శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులకు సృజన లక్ష్మీ నగర్ కాలనీవాసులు పూర్ణ కలశంతో, సన్నాయి మేళంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అనిరుధ్ రెడ్డి, మున్నా, బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ సుధాకర్ యాదవ్ మరియు దేవస్థానం పాలక మండలి సభ్యులు, అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని అన్ని కాలనీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కె.ఎస్.జి. యువసేన కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సృజనలక్ష్మీ నగర్ కాలని వాసులు కమ్యూనిటీ భవనం నిర్మించిన కౌన్సిలర్ శ్రీమతి జి. లావణ్య శశిధర్ రెడ్డి గారికి మరియు అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కమ్యూనిటీ భవనానికి స్థలం ఇచ్చిన రామిరెడ్డి, శ్రీనివాస్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం కన్నుల పండుగలా సాగింది. వచ్చిన ముఖ్య అతిథులకు, నాయకులకు ధన్యవాదాలు తెలపడంతో కార్యక్రమం ముగిసింది.