
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటానికి నిన్న బొల్లారం పరిధిలో పర్యటనకు వెళ్లారు. అక్కడ సిసి రోడ్ ప్రారంభోత్సవం సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టణ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారిని అడ్డుకున్నారు. శిలాఫలకంలో ప్రోటోకాల్ ప్రకారం పేర్లు రాలేదని, వారికి నచ్చిన బిఆర్ఎస్ నాయకుల పేర్లు వేశారని మీడియాతో చెప్పారు. మేము మంత్రి దామోదర రాజనరసింహ గారిచే సిసి రోడ్ ప్రారంభింప చేయాలనుకున్నాము. ఆ లోగానే మీరు వచ్చి ఎలా ప్రారంభిస్తారు? అని ఎమ్మెల్యే ను నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ‘గో బ్యాక్ ఎమ్మెల్యే’ అంటూ నినాదాలు చేశారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి.