
ఇంద్రధనుస్సు ప్రతినిధి: వడక్ పల్లి గ్రామంలోని ఐకానిక్ గ్లోబల్ స్కూల్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్స్ అఫ్ ఐకానిక్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, అమీన్ పూర్ 15వ వార్డ్ కౌన్సిలర్ కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫుడ్ ఫెస్టివల్ నందు చేసిన వివిధ రకాలైన వంటకాలను పరిశీలించారు. స్కూల్ విద్యార్థులతో సంక్రాంతి పండుగ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.