
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటి గ్రామ పరిధిలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు పేద, మధ్య తరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడంలో ప్రైవేటు పాఠశాలలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. భావి భారత పౌరులను తయారు చేయడంలో ప్రతి ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేష్ రావు, కోశాధికారి పి.రాఘవేంద్ర రెడ్డి, సంగం సభ్యులు పాల్గొన్నారు.