నాంపల్లిలో ప్రారంభమైన 2025 ఎగ్జిబిషన్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ – 2025 ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు సంతోషాన్ని కలిగించిందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఎంపి అనిల్ కుమార్, మాజీ పీసీసీ వి. హనుమంతు రావు, కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సునీత రావు వంటి నాయకులతో కలిసి పాల్గొనడం ఆనందదాయకం. ఎగ్జిబిషన్ నిర్వాహకులకు, ఈ గొప్ప ప్రదర్శనను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. నుమాయిష్ మన తెలంగాణ సంస్కృతికి, పారిశ్రామిక వైభవానికి ప్రతీక అని మహేష్ కుమార్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *