
ఇంద్రధనుస్సు ప్రతినిధి: 2025 నూతన ఆంగ్ల సంవత్సరములో అంతా మంచి జరగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 2024 లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, కనీసం కొత్త సంవత్సరంలో అయినా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో అమీనుపూర్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసి లో విలీనం అవుతుందని తద్వారా గ్రేటర్ పరిపాలన ద్వారా తమ కాలనీల్లో మౌలిక సదుపాయాలు విస్తరిస్తాయని కొండంత ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు.
నూతన ఆంగ్ల సంవత్సర 2025 సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని ఇంద్రధనుస్సు మీడియా ఆకాంక్షిస్తోంది! పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు, ప్రకటన కర్తలకు బీరంగూడ డాట్ ఇన్ లోకల్ న్యూస్ వెబ్ సైట్, ఇంద్రధనుస్సు మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.