
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మల్లారెడ్డి నగర్ కాలని పరిధిలోని ఎస్.ఎల్. ఎన్. హోమ్స్ వారు నూతన కమిటీని కాలని సభ్యులు ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా రామచంద్రా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రశాంత్, జనరల్ సెక్రెటరీగా శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీగా రాఘవేంద్ర, ట్రెజరర్ గా నాగయ్య, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా దీపక్, అభిషేక్, సత్యనారాయణ, సిద్ధ లింగ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు ముందుగా అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారిని వారి కార్యాలయంలో కలుసుకున్నారు. కొత్త కమిటీ సభ్యులను శశిధర్ రెడ్డి గారు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.