
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు డివిజన్ పరిధిలో గల పలు కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించడంతోపాటు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం డివిజన్ పరిధిలోని శాంతినగర్, శ్రీనగర్ కాలనీలలో స్థానిక కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్ తో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించి చాలా ఏళ్లు గడిచిపోవడం మూలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు కాలనీ వాసులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. అతి త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు చేపడతామని తెలిపారు. అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.