బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలలో డైట్ మెనూ ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీ (బాలికల) గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన డైట్ మెను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలు నేడు అత్యున్నత ఫలితాలు సాధిస్తూ ప్రభుత్వ విద్యా రంగంలో ఆదర్శంగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి శ్రద్ధతో చదివి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *