
ఇంద్రధనుస్సు ప్రతినిధి: 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారి నివాసంలో ఘనంగా నిర్వహించారు. కాట దంపతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిది అని అన్నారు. ప్రతీ పేదోడికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీ గారిది అని గుర్తు చేసారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.