
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పేదల పాలిట పెన్నిధి, ఆపదల్లో స్నేహ హస్తం అందించే మనసున్న మహానుభావుడు, మనకు ఎంతో ఇష్టమైన నాయకుడు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారికి ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటానికి పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్చార్జి శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి కాటా సుధా రాణి దంపతుల నేతృత్వంలో అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ టీమ్ సభ్యులు సంగారెడ్డి పట్టణంలో మంత్రి గారి నివాసానికి వెళ్లి, వారిని శాలువాతో సత్కరించి, పూలమాలలతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్ చెరు, అమీనుపూర్ టీమ్ కాంగ్రెస్ సభ్యులు తెలిపిన జన్మదిన శుభాకాంక్షలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జి. శశిధర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్, కౌన్సిలర్లు మల్లేష్, యూసఫ్, శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బి. సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మీకాంత్ రావు, అమీనుపూర్ లక్ష్మణ్, పెద్ద మల్లేష్, ఎల్లయ్య, కౌన్సిలర్లు మల్లేష్, యూసఫ్, మాజీ వార్డు సభ్యులు ప్రకాష్, రవీందర్, గోపాల్ రెడ్డి మరియు చుక్కా రెడ్డి, రామచంద్రారెడ్డి, ప్రవీణ్, వాణి నగర్ మహేష్ గౌడ్, కృష్ణా యాదవ్, అనిల్ గౌడ్, దీపక్, భిక్షపతి, సాయి కాలని మల్లేష్, రాము, యాదులు, శ్రీకాంత్ మరియు కె.ఎస్.జి సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.