
ఇంద్రధనుస్సు ప్రతినిధి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం 7-30 కు భూకంపం వచ్చింది. దీని ప్రభావం రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదైంది. భూకంపం వచ్చింది అని తెలియగానే హైదరాబాద్ ప్రజలు ఉలిక్కి పడ్డారు. చేస్తున్న పనులు వదిలేసి రోడ్లపైకి వచ్చారు. తెలంగాణ లోని ములుగు జిల్లా మేడారం వద్ద దీని ఎపిసెంటర్ ఉన్నట్లు గుర్తించారు. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం ఏమి లేదు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెస్మాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.