
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ పెద్ద చెరువుకు యూరప్ ఖండం నుండి అరుదైన “రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్” పక్షి పునరాగమనం పట్ల పక్షి ప్రేమికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పక్షి ఆగమనం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. హైడ్రా ఏర్పాటు వలన నీటి చెరువులను కబ్జా కోరల నుంచి రక్షించడం వలన చెరువులు ఆహ్లాదంగా మారాయి. ప్రకృతిని మనం పరిరక్షిస్తే మనకు మేలు జరుగుతుంది అని చెప్పటానికి ఈ సంఘటన నిదర్శనం. ఈ పక్షి ఎక్కడో యూరప్ ఖండం నుండి అమీనుపూర్ చెరువుకు రావడం శుభదాయకం. దేవుడు ఆశీర్వదించునట్లు భావిస్తున్నాము అని ముఖ్యమంత్రి తెలిపారు. “రెడ్ బ్రెస్టెడ్ ఫ్లై క్యాచర్” పునరాగమనం వలన జీవ వైవిధ్య భరితమైన అమీనుపూర్ చెరువు మరిన్ని పక్షులకు ఆవాసం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.