
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బిహెచ్ఇఎల్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను పటాన్ చెరు శాసనసభ్యులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మలి వయసులోనూ క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం క్రీడల ఏర్పాట్ల కోసం లక్ష రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఇక్బాల్, సత్యనారాయణ, శామ్యూల్, పద్మ, క్రీడాకారులు పాల్గొన్నారు