
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలని రెండవ ఫేజ్ సర్వే నెంబర్ – 848లో రోడ్డు నెంబర్ 18 వద్ద రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటిని ఈ రోజు ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేశారు. స్థానిక కాలని ప్రతినిధులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోకపోవడంతో ఆర్. లింగమయ్య అనే కాలని వాసి హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు తనిఖీ చేసి రోడ్డు అని నిర్ధారించుకున్న పిదప కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. ఈ రోజు ఉదయం రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటిని భారీ యంత్రాల సాయంతో కూల్చివేశారు. కూల్చివేత సందర్భంగా ఎవరైనా ఆపటానికి ప్రయత్నించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకుని ఇంటిని నేలమట్టం చేసింది హైడ్రా. ఈ సమాచారం టివి ఛానెల్స్ ప్రసారం చేయడంతో రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారు ఆందోళన చెందుతున్నారు.