
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి 55వ జన్మదిన మహోత్సవ వేడుకలను అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకువచ్చి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అన్ని రంగాల్లో అగ్ర భాగాన నిలబెడుతున్నట్టు మరియు దేశంలో మరెక్కడా లేనివిధంగా ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ, దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే సంకల్పంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం వారికే చెల్లిందని, ఇదే విధమైన ప్రజాపాలనను ఇకముందు కొనసాగే విధంగా ఆ భగవంతుడు ఆయనకు పూర్తి శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవస్థానం ఆలయ చైర్మన్ బైస సుధాకర్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు దండు రమేష్ యాదవ్, కుమ్మరి మహేష్, మహమ్మద్ సలీం, మాజీ వార్డు సభ్యులు పెద్ద బానోళ్ల ప్రకాష్, గోపాల్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు లక్ష్మీకాంతరావు, గొల్ల మల్లేష్ యాదవ్, ఎల్వర్తి మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిక్షపతి, ఈశ్వర్ రెడ్డి, చుక్కారెడ్డి, సురేష్ నాయక్, బిల్లి శ్రీనివాస్ యాదవ్, బైసా కృష్ణ, మస్తాన్ నాయుడు, ఉమా శంకర్, అమీన్పూర్ శ్రీనివాస్, శంకర్, సిద్ధు, ఉస్కెబాయ్ సాయి, మోహన్ రెడ్డి, కృష్ణ, శరత్, వెంకట్, రామచంద్రా రెడ్డి, కైరుద్దీన్ గౌరయ్య, ఫణి తదితరులు పాల్గొన్నారు.