
1950 …కృష్ణాజిల్లా మైలవరం హైస్కూల్ ..షేక్స్ ఫియర్ రాసిన నాటకం ను విద్యార్థులు ప్రదర్శిస్తున్నారు..!
అందులో ఒక 13 యేండ్ల కుర్రాడు పాఠాలు ఒప్పచెప్పినట్లు డైలాగ్స్ గబగబా చెప్పేస్తున్నాడు..ప్రేక్షకులు ఆ పిల్లాడి తత్తరపాటు చూసి పకపకా నవ్వేస్తున్నారు…!!
ఆ పిల్లాడికి అర్థంగాక నాటకం అయిపోయిన తరువాత తన గురువు,తనకు నాటకంలో వేషం ఇచ్చిన హిందీ మాష్టర్ ను అడిగాడు..వారు ఎందుకలా నవ్వుతున్నారని…నీ నటన చూసిలేరా..అద్భుతంగా చేసావంటూ తన శిష్యుడికి అబద్ధం చెప్పాడా గురువు,. ఆ అబద్దమే ఆ పిల్లాడికి నాటకరంగం పై అడుగులు పడటానికిదారి తీసింది…!!
హైస్కూల్ నుండి కళాశాల చదువుకు విజయవాడ లో సి ఆర్ రెడ్డి కళాశాలలో చేరాడు.. అక్కడ సహ స్టూడెంట్స్ అయిన శివరామకృష్ణ, మురళీమోహన్ గార్లతో కలిసి నాటకాలు వేసేవాడు..!
“పునర్జన్మ” అనే నాటకం మంచిపేరు తెచ్చింది…ఇంతలో కీలుగుర్రం సినిమా వచ్చింది.అది చూసిన ఆ కుర్రాడు సినిమాలలో చేరాలని ఉబలాటపడిపోసాగాడు..!
మల్లీశ్వరి సినిమాతో NTR గారి అభిమానిగా మారిపోయాడు..!
బియస్సీ లో వుండగానే పెళ్ళైపోయింది..!
డిగ్రీ పూర్తికాగానే లా చేయాలని చెన్నపట్నం బయలుదేరాడు..!
పేరుకు లా చదవడం….!!
అంతర్గతంగా సినిమాలలో నటించాలనే…మధ్యాహ్నం వరకు క్లాసులు…తర్వాత స్టుడియో చుట్టూ ప్రదక్షిణలు …!!
యన్ టి ఆర్ గారిని కలిసారు ఒకరోజు..మీరు చాలా అందంగా వున్నారు బ్రదర్ ..హీరోగానే ట్ర్రె చేయండి,అంటూ సలహా ఇచ్చారు రామారావుగారు..!
కానీ వేషాలు అంత ఈజీగా రాలేదు..చివరికి యన్ టి ఆర్ గారే “దైవబలం” అనే సినిమాలో చిన్నవేషం ఇప్పించారు.అది ఫేయిల్ .1960 లో భక్త శబరి సినిమాలో కొంచెం గుర్తింపు…..!!!
నర్తనశాల,వీరాభిమన్యు లలో పేరువచ్చినా వేషాలు మాత్రం రాలేదు…..పూర్తిగా డిఫ్రెషన్ లోకి వెళ్ళే పరిస్థితి..!!
పెళ్ళి అయి భార్యాబిడ్డలు.. ధనవంతుడేమీకాదు..ఇంట్లో పూటగడవడం చాలా కష్టమైపోతుంది..!
ఇంక ప్రయత్నాలు మాని తిరిగి సొంతఊరువెళదామని భార్యతో నిరాశాపూరితమైన మాటలు…!!
అవి విన్న అతని భార్య “ఇన్నిరోజులు చూసారుకదా!! మరో కొన్ని ఎదురుచూద్దాం-నాకు నమ్మకం వుంది…మీరు మంచి నటులవుతారని”అంటూ ఓదార్పు..!
ఆమె మాటలతో మళ్ళీ ఆశ…!!
అతని పరిస్థితులు తెలిసిన యన్ టి ఆర్ ,ఎయన్నార్ తమ సినిమాలలో ఏదొక పాత్రకు అతనిని సిపార్స్ చేసేవారు..!
అలా సాగుతున్న అతని జీవితంలో 1969-70 లో వచ్చిన “మనుషులు మారాలి “అనే సినిమాతో అతని రోజులే మారిపోయాయి…!!
శోభన్ బాబు అనే హీరో తెలుగుసినీపరిశ్రమలో గుర్తింపు వచ్చేసింది..!
తర్వాత బలిపీఠం, చెల్లెలుకాపురం, సోగ్గాడు,గోరింటాకు లాంటి సినిమాలతో ఒక విజయవంతమైన హీరోగా మారిపోయారు….!!
కార్తీకదీపం, దేవత లాంటి సినిమాలతో మహిళాప్రేక్షకుల అభిమాన హీరోగా ముద్రపడిపోయారు..!
వృత్తి ,కుటుంబం సమన్వయం చేసుకుంటుా ,తనకు వచ్చిన పారితోషికంను కుటుంబ అవసరాలకు పోను,మిగతా డబ్బుతో భూములు కొనిపెట్టుకొనేవాడు…అదే ఆయనను ధనవంతుడిని చేసింది..!
ఉదయం ఆరుగంటలకు షూటింగ్ అయితే ఐదుకే హాజరయ్యేవాడు. సాయంకాలం ఆరైతే ఇంటికి వెళ్ళిపోయేవాడు…క్రమశిక్షణలో శోభన్ బాబు గారిని ఉదాహరణగా చెబుతారు..!
అజాతశతృవుగా చెబుతారు..తన దగ్గర పనిచేసేవారందరి భాగోగులు ,బాధ్యతలు తనే తీసుకొనేవాడు..ఇల్లు కట్టించాడు…సినిమాల నుంచి రిటైర్ అయిన తరువాత మళ్ళీ సినిమారంగంవైపు చూడలేదు..!
తన ఉన్నతికి కారణమైన అందరినీ ఘనంగా సన్మానించాడు.. హిందీపండిట్ గారినైతే తనతోనే వుంచుకున్నారట చాలా రోజులు..!
ఒక భర్తగా,తండ్రిగా,నటుడిగా పరిపూర్ణమైన మనిషి శోభన్ బాబు గారు.ఆయన జీవితం ఆదర్శనీయం…!!!
– ఇంద్రధనుస్సు ప్రతినిధి