పటాన్ చెరు నియోజకవర్గంలో నిషేదిత జాబితాలో 63 జి.పి. వెంచర్లు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం పటాన్ చెరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో 63 జి.పి. లేఔట్స్ ను నిషేధిత జాబితాలో చేర్చింది. ఒక్క అమీనుపూర్ మున్సిపాలిటీలో అమీనుపూర్ 6, కిష్టారెడ్డిపేట్ 10, పటేల్ గూడ 11, సుల్తాన్పూర్ 4 వెంచర్లు, తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం 8, కర్దనూర్ 2, పటాన్ చెరు మండలం చిట్కుల్ లో 16, ఇంద్రేశంలో 5 వెంచర్లు నిషేధిత జాబితాలో చేర్చారు. దీని వలన జి.పి. లేఔట్స్ లో క్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలోని సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచారం. పర్యవసానంగా సామాన్యులు పైసా పైసా కూడబెట్టి సంపాదించుకున్న ప్లాట్స్ నిస్తేజంగా మారనున్నాయి. ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావడంలేదని సామాన్య జనాలు వాపోతున్నారు. సామాన్యులు నష్టపోకుండా ప్రభుత్వ పరంగా ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *