పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకున్న నీలం మధు! భగ్గుమన్న కాటా అభిమానులు!!

రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము. విధి ఆడే వింత ఆటలో గెలుపు ఓటములు ఎవరివో చెప్పడం కష్టం! 10 సంవత్సరాల పాటు పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అంచెలంచెలుగా కాపాడుకుంటూ వచ్చిన “కాటా శ్రీనివాస్ గౌడ్” ఒక వైపు, బి ఆర్ ఎస్ పార్టీలో టికెట్ ఆశించి విఫలమై, ఆ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన “నీలం మధు ముదిరాజ్” మరో వైపు ఉండి రాజకీయ చదరంగంలో నిచ్చెనలను అధిరోహించి అనూహ్యంగా పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్నాడు నీలం మధు. నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది. కాటా అభిమానులు ఈ నిర్ణయం పట్ల భగ్గుమన్నారు. పటాన్ చెరు, ఆమీనుపూర్, బీరంగూడ పరిధిలో కాటా అభిమానులు రోడ్ల మీదకు వచ్చి డబ్బులకు టికెట్లు అమ్ముకున్నరంటూ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను తగులబెట్టారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ, రకరకాలుగా వాట్సప్ గ్రూప్స్ లో పోస్ట్ చేశారు కాటా అభిమానులు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాటా పోటీ చేసి తన సత్తాను చూపాలని మెజారిటీ సభ్యులు కోరుతున్నట్టు సమాచారం!! మరి కాటా శ్రీనివాస్ గౌడ్ తన భవిష్యత్ నిర్ణయం ఎలా తీసుకుంటారు? తెలియాలంటే నామినేషన్ల పర్వం ముగిసేలోగా ఏమి జరుగుతుందో వేచి చూద్దాం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *