
పటాన్ చెరు నియోజకవర్గం నుండి పార్టీ టికెట్ ఎవరికీ ప్రకటించకుండా ఓటర్లను కన్ఫ్యూస్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. నామినేషన్ల పర్వం మొదలైనా, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చేది తెల్వక జనాలు పరిషాను అవుతుండ్రు. తోటి పార్టీలు ప్రచార పర్వంలో ముందుంటే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు. ఆరు గ్యారంటీలను గడప గడపకు తెలియజేస్తున్నప్పటికీ, ప్రచార రథాల సందడి కనిపించక కాంగ్రెస్ పార్టీ వెనక పడినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మూడవ లిస్ట్ లో పటాన్ చెరు అభ్యర్థి ఎవరో తెలిసిన పిదప ప్రచారం పుంజుకోవచ్చు! కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చివరి దాకా ప్రకటించకపోవడం వలన పోటీ చేసే అభ్యర్థుల్లో విపరీతమైన టెన్షన్ భరించవలసి వస్తుంది. ఎన్నికల సమయంలో ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే దానికి మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వస్తుంది?
10 సంవత్సరాల నుంచి పటాన్ చెరు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి విశేషంగా కృషి చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ రేస్ లో ముందు ఉండేవారు. ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ నుండి నీలం మధు ముదిరాజ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి, టికెట్ రేస్ లో తాను ఉన్నట్లు ప్రకటించాడో, అప్పటి నుంచి పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్, ఇద్దరి మధ్య పోటా పోటీగా కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పులు వచ్చేలా చేస్తున్నది.ఈ సస్పెన్స్ ఇంకా రెండు రోజులు అంటున్నారు! చూద్దాం !!