
బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు నియోజకవర్గం అభ్యర్థి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారి సతీమణి తుమ్మల సునీత పాండురంగారెడ్డి గారు మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గూడెం మహిపాల్ రెడ్డి విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గత పది సంవత్సరాలలో అమీన్పూర్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె గడపగడపకు వివరించారు.