
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, కృష్ణ యాదవ్, సంతోష్ యాదవ్, మహేష్ యాదవ్, కాజిపల్లి ముత్తంగి గ్రామాలకు చెందిన 200 మంది యువకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మైత్రి గ్రౌండ్ నుండి జిఎంఆర్ ఫంక్షన్ హాల్ వరకు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయానికి ఈ ర్యాలీ నిదర్శనమని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మనోజ్ కుమార్ ఠాకూర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.