
సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ తుక్కుగూడలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయాలని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రామచంద్రాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొని విజయభేరి సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అరుణ్ గౌడ్ గారు సభ విజయవంతం చేయాలని పార్టీ పై అభిమానంతో లక్ష రూపాయల చెక్ ను కాట శ్రీనివాస్ గౌడ్ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కో ఆర్డినేటర్ శ్యామ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, పీసీసీ మెంబెర్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్లు సుధాకర్ గౌడ్, వడ్డె క్రిష్ణ, పుట్ట నర్సింగ్, టౌన్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్ శశిధర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సి ప్రభాకర్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్స్ ఈశ్వర్ సింగ్, శ్రీనివాస్, స్టేట్ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ నరసింహ, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, సంగారెడ్డి జిల్లా ఓ బి సి సెల్ ప్రెసిడెంట్ మావీన్ గౌడ్, సంగారెడ్డి జిల్లా ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ యాదగిరి, అసెంబ్లీ ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ మహేష్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ అధ్యక్షులు, కె ఎస్ జి యువసేన సభ్యులు పాల్గొన్నారు.