తొమ్మిదో విడత హరిత హారంలో పాల్గొన్న అమీనుపూర్ మున్సిపల్ ఛైర్మన్ టి.పి.ఆర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన తొమ్మిదో విడత హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు రాఘవేంద్ర కాలనీ, 12వ వార్డు జయలక్ష్మి నగర్ కాలనీ, 10వ వార్డ్ సాయి కాలనీ,9వ వార్డ్ I T W సిగ్నోడ్ కాలనీలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజలకు మున్సిపల్ చైర్మన్ టిపిఆర్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంతోపాటు.. ఖాళీ స్థలాలు పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వ్యాప్తంగా ప్రతి కాలనీలో హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో, కౌన్సిలర్లు కల్పన ఉపేందర్ రెడ్డి, బోయిని బాలమణి బాలరాజు, ప్రమోద్ రెడ్డి, కొల్లూరి మల్లేష్, కవిత శ్రీనివాస్ రెడ్డి, యూసుఫ్ కోఆప్షన్స్ సభ్యులు యునుస్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దాస్ యాదవ్, శేఖర్, చౌటకూరి మైపాల్ రెడ్డి తదిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *