
అమీన్ పూర్ మున్సిపాలిటీ తహశీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు ఏఐసీసీ లోక్ సభ అబ్జర్వర్ రెజీనా మరియు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం, పర్మినెంట్ చేయడం, ప్రమాద భీమా కల్పించడం వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేనియెడల అంగన్వాడి ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, ట్రెజరర్ సుధాకర్ యాదవ్, జనరల్ సెక్రెటరీ రమేష్ యాదవ్, మహేష్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయకులు గోపాల్ రెడ్డి, లక్ష్మీకాంత్, భిక్షపతి, సతీష్, విజయ్, క్రిష్ణ, హనుమంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కె ఎస్ జి యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.