
అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో ఇండస్ వ్యాలి సొసైటీ లో సుమారు పది లక్షల అంచనా వ్యయంతో మున్సిపల్ నిధులతో సిసి రోడ్లు మరియు ప్యాచ్ వర్క్ కు శంకుస్థాపన చేసిన స్థానిక చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. అనంతరం స్థానిక చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారిని శాలువా తో సత్కరించిన కాలనీ వాసులు. ఈ సందర్భంగా చైర్మన్ టి పి ఆర్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులలో ముందస్తు ప్రణాళికలో పోతున్నామని అమీనుపూర్ మున్సిపల్ కొత్త మున్సిపాలిటీ అయినా తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు పోటీగా అభివృద్ధి కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ AE ప్రవీణ్, కో-ఆప్షన్ సభ్యులు యూనుస్, బి ఆర్ ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, దాసు యాదవ్, మహేష్, విజయ్, కాలనీ ప్రెసిడెంట్ భవ, వైస్ ప్రెసిడెంట్ నరసింహ, జనరల్ సెక్రెటరీ ప్రవీణ్, కాలనీ వాసులు పాల్గొన్నారు.